శ్రీకాకుళంలో జరిగిన జిల్లా స్థాయి హై స్కూల్ విద్యార్థుల క్రీడా పోటీలలో మందస మండలం సొండిపూడి ZPHS విద్యార్థులు సత్తాచాటారు.పి రాహుల్ 1500 మీటర్ల పరుగు పందెంలో, కె. ధర్మ తేజ కబడ్డీ విభాగంలో విజేతలగా నిలిచి, రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో బుధవారం హెచ్ఎం సుందర సాల్మన్, సిబ్బంది అభినందనలు తెలిపారు.