E.G: దీపావళి పండగ నేపథ్యంలో లైసెన్స్ లేకుండా బాణాసంచా తయారీ, విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కొవ్వూరు సీఐ విశ్వం బుధవారం హెచ్చరించారు. పేలుడు పదార్థాలు నిల్వ చేసే సమయంలో కచ్చితంగా నిర్దేశించిన భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఎక్కడైనా అక్రమ నిల్వలు ఉంటే 112, 9440796622 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.