NLG: నల్లగొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఇద్దరు యువకులు అరెస్టయ్యారు. గడ్డం కృష్ణ (21), మధు (19) కలిసి బాలికను షంషునగర్లో గదికి తీసుకెళ్లి అఘాయిత్యం చేయడంలో బాలిక తీవ్ర రక్తస్రావంతో మృతి చెందినట్లు DSP శివరాం రెడ్డి వెల్లడించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తూ అనంతరం కోర్టుకు హాజరు పరిచారు.