CTR: కోననసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మాజీ మంత్రి శ్రీమతి ఆర్ కె రోజా బుధవారం ఉదయం సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, పాలక సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం అర్చకులు వేదమంత్రాలతో రోజమ్మను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు.