MLG: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు ప్రశ్నిస్తూనే ఉంటామని ములుగు జిల్లా BRS పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తెలిపారు. ఏటూరునాగారం మండలంలోని చెలపాక గ్రామంలో బుధవారం ఆయన కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.