VZM: ఈనెల 9, 10వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ సిహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి జి.మురళీనాథ్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఛైర్పర్సన్ జిల్లాకు వస్తారన్నారు. ముందుగా క్షేత్రస్థాయిలో పర్యటించి, అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. .