ATP: ఉరవకొండ పట్టణంలోని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు లాంటివన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తామన్నారు.