ADB: అడవి అలుగును అక్రమంగా విక్రయించడానికి యత్నించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఇంఛార్జ్ డీఎఫ్వో రేవంత్ చంద్ర పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. గాదిగూడ మండలానికి చెందిన పెందూరు మహేష్, కినక శంకర్, పెందూరు జోగునాథ్ తమ పొలాల్లో అలుగును పట్టుకున్నారన్నారని, రూ. 5 లక్షలకు బేరం కుదిరించుకున్నట్లు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు.