అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న బాలీవుడ్ సినిమా ‘సంతోష్’. CBFC అభ్యంతరాల కారణంగా ఇండియాలో ఇది విడుదల కాలేదు. ఎట్టకేలకు ఈ సినిమా OTTలోకి రాబోతుంది. ప్రముఖ OTT సంస్థ లయన్స్ గేట్ ప్లేలో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ ఉత్తర భారతదేశంలో కుల ఆధిపత్యం, లింగ వివక్ష వంటి అంశాలతో తెరకెక్కింది.