గాజా యుద్ధం ముగింపు దిశగా కీలక అడుగులు పడ్డాయి. హమాస్-ఇజ్రాయెల్ మధ్య బందీలు-ఖైదీల విడుదల జాబితాలను ఇరు నాయకులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇకపై గాజాలో శాంతి నెలకొంటుందని అక్కడి ప్రజలు స్వేచ్ఛగా, ఆకలి కేకలు లేకుండా జీవిస్తారని పలువురు భావిస్తున్నారు. రెండేళ్ల పాటు జరిగిన ఈ యుద్ధంలో 67 వేల మందికిపైగా మృతి చెందారు. 1.70 లక్షల మంది తీవ్రంగా గాయపడ్డారు.