AP: కోనసీమ జిల్లా రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఏడుగురికి చేరింది. పలువురికి తీవ్ర గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు సమయంలో 40 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.