BDK: లంబాడీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ నాయక్ డిమాండ్ చేశారు. అనంతరం వారం వారు ఎస్సై సుమన్‌కు ఫిర్యాదు చేశారు. మరోసారి ఈ విధంగా జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. జాతిపై వెకిలి చేష్టలు మానుకోవాలని పేర్కొన్నారు.