AP: రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మతులకు రూ.వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేసింది. 274 రోడ్ల మరమ్మతులకు ఈ నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పాలనాపరమైన అనుమతులను మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. స్టేట్ హైవేస్లో 108 పనులకు రూ.400 కోట్లు, జిల్లా రోడ్లలో 166 పనులకు రూ.600 కోట్లు మంజూరు చేశారు.