కోనసీమ: రాయవరంలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ ఘోర ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని సూచించారు. అనంతరం బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు.