TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టులో వాదనలు నడుస్తున్నాయి. దీనిపై పిటిషనర్ తరపు న్యాయవాదికి హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. అసెంబ్లీలో బిల్లు ఎప్పుడు పాస్ అయింది? ఆమోదం కోసం గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందా? గవర్నర్ పేరు మీద జీవో జారీ చేశారా? రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారిందా? అని ప్రశ్నించింది.