VSP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YS జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తున్నారని, ఈ సందర్భంగా చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలను ప్రజల ముందు పెడతారని మాజీ మంత్రి విడదల రజినీ అన్నారు. బుధవారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తామని ఆమె స్పష్టం చేశారు.