అన్నమయ్య: రాయచోటిలోని కళాశాలలో ప్రిన్సిపాల్ డా. ఎం. సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జీఎస్టీ సవరణలపై బుధవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన జీఎస్టీ సవరణల ప్రాధాన్యం, పారదర్శక పన్ను విధానం గురించి విద్యార్థులకు వివరించారు. వైస్ ప్రిన్సిపాల్ డా. ఎం. మునియా నాయక్ జీఎస్టీతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోందని పేర్కొన్నారు.