WGL: చెన్నారావుపేటలో బుధవారం BRS ఆధ్వర్యంలో ‘కాంగ్రెస్ బాకీ కార్డులు’ పంపిణీ చేశారు. కార్యక్రమానికి నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై ప్రజలకు కార్డులు అందజేశారు. మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని ఆయన తెలిపారు. స్థానిక ఎన్నికల్లో BRS అభ్యర్థులను గెలిపించాలని కోరారు.