ELR: మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికై సీఐటీయూ పోరాటాలు చేస్తుందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం సీఐటీయూ కార్యాలయంలో పలువురు మున్సిపల్ వర్కర్స్ యూనియన్లో చేరారు. నూతనంగా యూనియన్లో చేరిన వారికి ఆయన కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. సీఐటీయూ వ్యక్తులపై నడిచే సంస్థ కాదని చెప్పారు.