టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ సియట్ క్రికెట్ అవార్డుల కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. భారత మాజీ కోచ్ అభిషేక్ నాయర్ నేతృత్వంలో దాదాపు 10 కేజీలు తగ్గిన రోహిత్.. ఇప్పుడు మరింత నాజూగ్గా మారిపోయాడు. దీంతో ఇప్పుడు రోహిత్‌ను చూసిన ప్రతిఒక్కరూ ‘రెండేళ్లు ఏంటి నాలుగేళ్లైనా సరే ఆడేలా ఉన్నాడు’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.