ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్లో పెట్టుబడికి ఇదే సరైన సమయమని పునరుద్ఘాటించారు. వివిధ రంగాల్లో ‘మేక్ ఇన్ ఇండియా’ అవసరాన్ని నొక్కి చెప్పిన ఆయన, ప్రభుత్వ విధానాల కారణంగా భారత్కు ‘పెట్టుబడులకు అనుకూలమైన దేశం’గా ఇమేజ్ వచ్చిందన్నారు. డిజిటల్ కనెక్టివిటీ అనేది ప్రతి భారతీయుడి జీవితంలో విడదీయరాని భాగమని స్పష్టం చేశారు.