NLR: మనుబోలు కోదండ రామాపురం దేవాంగుల వీధిలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మకు అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. రంగురంగుల విద్యుత్ దీపాలు, బాణాసంచా వెలుగులలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు శ్రీనివాసులు అమ్మవారి దేవస్థానం వద్ద నవావరణ పూజ, దేవి ఖడ్గమాలార్చన, కుంకుమార్చన నిర్వహించి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు.