KMM: పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కొణిజర్ల పోలీస్ స్టేషన్ ప్రక్కన ఏర్పాటు చేసిన HPCL పెట్రోల్ బంకును బుధవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రారంభించారు. పోలీస్ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ద్వారా నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించడమే కాకుండా దీనిపై వచ్చే ఆదాయాన్ని పోలీసు సిబ్బంది సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుందన్నారు.