తమిళనాడులోని కరూర్‌లో విజయ్ దళపతి ర్యాలీలో 41 మంది చనిపోయిన ఘటనపై నటుడు రిషబ్ శెట్టి స్పందించారు. హీరోలను ప్రేక్షకులు ఆరాధిస్తారని, ఇలాంటి ప్రమాదాలు జరగడం దురదృష్టకరమని అన్నారు. కరూర్ ఘటన ఒక్కరి తప్పు వల్లే జరిగిందని చెప్పలేమని.. ఇది చాలామంది చేసిన తప్పిదమని చెప్పారు. ఇలాంటి సభలు నిర్వహిస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు.