TG: గ్రూప్-1 అభ్యర్థులకు అండగా ఉంటామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద గ్రూప్-1 అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలో ఆమె పాల్గొని మాట్లాడారు. ‘2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక పాత ఉద్యోగాలే ఇచ్చారు. కోర్టుల్లో జడ్జీలకు అర్థం అయ్యేదాకా పోరాటం చేస్తాం. గ్రూప్-1 నియామకాలను రద్దు చేసి.. మళ్లీ పరీక్ష నిర్వహించాలి’ అని కవిత డిమాండ్ చేశారు.