ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC) సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో డిజిటల్ రంగంలో భారత్ సాధించిన ప్రగతిని వివరించారు. ‘భారత్లో 1GB వైర్లెస్ డేటా ధర ఒక కప్పు టీ ధర కంటే తక్కువగా ఉంది. డిజిటల్ కనెక్టివిటీ ఇక విలాసమో, ప్రత్యేక హక్కో కాదు, అది ప్రతి భారతీయుడి జీవితంలో విడదీయలేని భాగంగా మారింది’ అని మోదీ అన్నారు.