BDK: జిల్లా BRS పార్టీ కార్యాలయంలో ఇవాళ బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. సమావేేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆరోపించారు. పేద బడుగు బలహీనవర్గాల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేయడం లేదని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసం పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.