AP: చిత్తూరు జిల్లా దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన కేసులో సర్పంచ్ గోవిందయ్యను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు మండిపడ్డారు. ‘ఒప్పుకుంటే వదిలేస్తామని గోవిందయ్యను పోలీసులు టార్చర్ పెట్టారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులైనా సరే మీ పేర్లను డిజిటల్ బుక్లో పెడతాం’ అని వైసీపీ నేతలు పేర్కొన్నారు.