హనుమకొండ పట్టణంలోని కాకతీయ యూనివర్సిటీ గేటు ముందు విద్యార్థి సంఘాల నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. మాదిగ సామాజిక వర్గాన్ని కించపరిచేలా, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం వెంటనే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని, నాయకులను స్టేషన్‌కు తరలించారు.