GNTR: పొన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి(CHC) బుధవారం అంబులెన్స్ వచ్చింది. మంగళవారం రాత్రి ఆసుపత్రిని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి అంబులెన్స్ అవసరం ఉందని వైద్యులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో, ఆమె వెంటనే స్పందించి అంబులెన్స్‌ను తెప్పించారు. మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.