ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్, ట్రావిస్ హెడ్‌కు ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ భారీ మొత్తం ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆస్ట్రేలియా క్రికెట్ నుంచి బయటకు వస్తే వారికి రూ.58 కోట్లు చొప్పున ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. IPLతో పాటు తమ ఫ్రాంచైజీకి చెందిన జట్ల తరఫున ఇతర టీ20 లీగుల్లోనూ ఆడాల్సి ఉంటుందట. అయితే, దీనిపై వారిద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.