NLG: జూన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సాధారణ వర్షం 526.6 మిల్లీమీటర్లు కాగా 670.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అతివృష్టి కారణంగా జిల్లాలో రైతులు సాగు చేసిన వరి, పత్తి పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. పత్తి ఏరే సమయంలో గత రెండు మూడు రోజుల నుంచి జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పత్తి చేలు ఎర్ర భారీ తెగుళ్ల బారిన పడ్డతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.