SKLM: క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతమే లక్ష్యమని జిల్లా పార్టీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం బీజేపీ కార్యాలయంలో బుధవారం రూరల్ మండలం నుండి సుమారు 10 కుటుంబాలను పార్టీ కండువా కప్పి బీజేపీలోకి సాదర స్వాగతం పలికారు. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు.