MDCL: మల్కాజ్గిరి పరిధి భ్రమరాంబికా కాలనీలో రూ.8 లక్షలతో సీసీ రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను ప్రారంభించినట్లుగా కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. మల్కాజ్గిరి డివిజన్ పరిధిలో నిధులు లేని సమస్య అధికంగా ఉందని కార్పొరేటర్ అన్నారు. అయినప్పటికీ ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకొని, సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు.