AP: ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని మోదీకి మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ప్రయాణం దూరదృష్టి, నిబద్ధత, దేశ వృద్ధి లక్ష్యాలతో సాగిందని అన్నారు. ‘ప్రధానిని ప్రత్యక్షంగా కలిసిన ప్రతి సందర్భం ఓ పాఠం. ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో.. దీర్ఘాయుష్షు పొందాలి. మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలి’ అని లోకేష్ ఆకాంక్షించారు.