RR: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్రం తీసుకొచ్చిన జీవో నెం.9 అమలు చేయాలని కోరుతూ షాద్ నగర్ MLA వీర్లపల్లి శంకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల రాజకీయాల అభ్యున్నతికి పాటుపడే విధంగా తీసుకొచ్చిన ఈ రిజర్వేషన్లు అమలు జరిగేలా చూడాలని దరఖాస్తు ద్వారా ఎమ్మెల్యే కోరారు.