CTR: మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై జీడీనెల్లూరు ఎమ్మెల్యే థామస్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని వైసీపీ ఇంఛార్జ్ కృపాలక్ష్మి అన్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నారాయణస్వామిని ఏకవచనంతో దూషించడం సబబు కాదన్నారు. కాగా, చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని కోరారు. అనంతరం ఇలాంటి ఘటనలు పునరావృత్తమైతే చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పారు.