WGL: నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఇటీవల మరణించారు. ఈ క్రమంలో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బుధవారం MLA ని పరామర్శించారు. వారి నివాసానికి వెళ్లి కాంతమ్మ చిత్రపటం వద్ద నివాళూలర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. మార్కెట్ డైరెక్టర్ కుమారస్వామి, బొంత శ్రీను తదితరులున్నారు.