KMM: ముదిగొండ మండల రైతు వేదికలో బుధవారం ఎన్నికల నియమావళి పాటిస్తూ విధులు పారదర్శకంగా నిర్వహించాలని ఏపీవో, పీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల ప్రత్యేక అధికారి మహేష్ తెలిపారు. పోలింగ్ స్టేషన్లో ఓటర్లకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవకతవకలకు పాల్పడకుండా నియమ నిబంధనలను పాటిస్తూ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు.