RR: చీఫ్ జస్టిస్ గవాయ్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ షాద్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా MRPS రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ల నరసింహ మాట్లాడుతూ.. ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని దాడికి పాల్పడ్డ వ్యక్తిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.