AP: కోనసీమ జిల్లా రాయవరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఆరుగురు మృతిచెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఘటనాస్థలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.