ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో పలు రికార్డులపై రోహిత్ శర్మ కన్నేశాడు. భారత్ తరఫున 500 కంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ప్లేయర్ల జాబితాలో రోహిత్ (499) చేరతాడు. మరో 8 సిక్స్‌లు కొడితే వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు (352) బాదిన ఆటగాడిగా నిలుస్తాడు. వన్డేల్లో మరో 54 పరుగులు చేస్తే భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా (11,222) అవతరిస్తాడు.