సత్యసాయి: పెనుకొండ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టామని మంత్రి సవిత తెలిపారు. పెనుకొండ – కోనాపురం రహదారిని ఇవాళ మంత్రి పరిశీలించారు. కొండాపురం రోడ్డు రూ. 80 లక్షలతో నిర్మిస్తున్నామన్నారు. ఈ రహదారి నిర్మాణం వల్ల ట్రాఫిక్ నుంచి ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు. నారాయణమ్మ కాలనీలో రూ. 20 లక్షలతో సీసీ కాలువలు నిర్మిస్తున్నామన్నారు.