NZB: మాధవనగర్ గేట్ వద్ద బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. వెంటనే ఆర్వోబీని పూర్తి చేయాలని బుధవారం డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ.. రైల్వే ఓవర్ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఆర్వోబీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన రూ.10 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.