కన్నడ ఇండస్ట్రీ తనని బ్యాన్ చేసినట్లు వస్తోన్న రూమర్స్‌పై నటి రష్మిక మందన్న స్పందించారు. ఇప్పటివరకూ తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని తేల్చి చెప్పారు. ఇతరుల కోసం జీవించొద్దని అన్నారు. ఇలాంటి రూమర్స్ అన్నీ అపార్థం వల్ల పుట్టుకొస్తాయని తెలిపారు. కాగా, రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.