కృష్ణా: తెలుగు భాషకు గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎంవీ కృష్ణారావు అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బుధవారం అవనిగడ్డలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సందర్భంగా వారి విగ్రహానికి రవీంద్ర నివాళులర్పించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ పాల్గొన్నారు.