అసోంకు చెందిన ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సింగర్ కజిన్, డీఎస్పీ సందీపన్ గార్గ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు కూడా సింగపుర్లో జరిగిన యాట్ పార్టీలో ఉన్నట్లు సమాచారం. కాగా, జుబీన్ మృతిపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవల అతడి భద్రతా సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో రూ.కోటి లావాదేవీలపై అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.