KMM: రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విద్యార్థులకు బిల్లులు చెల్లించకుండా విద్యను దూరం చేస్తూ వివక్షత చూపుతుందని AISF జాతీయ సభ్యుడు ఇటికాల రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం గిరిప్రసాద్ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా ప్రభుత్వం విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంలేదన్నారు.