NDL: కొలిమిగుండ్ల (M) మదనంతపురం గ్రామంలో ఇవాళ పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు.గ్రామ శివారులో ఉంటున్న అంబటి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈ రోజు పొలానికి వెళ్లిన సమయంలో దొంగలు ఇంటి తాళాన్ని పగలగొట్టి బీరువాలో ఉన్న నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.