KMR: బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్, కిష్టాపూర్, దామరంచ గ్రామాల్లో సబ్ కలెక్టర్ కిరణ్మయి బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాలో అనర్హుల పేర్లు చేరాయన్న ఫిర్యాదు మేరకు ఆమె క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఎంపీడీవో, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.